నిష్ఠుర నిజం
ఆ:వె. మతము పెంచునేని మనుషులందు మమత
దురభిమానమేల ధరణి నిండె
కంచె దిటవుమాట కల్లగాకేమౌను
పంటపొలము నడుమ పశువు మేయ.
ఆ:వె. గద్దెనెక్కి జనుల గాపాడ మాన్యులు
హింసలేల రేగె హితవు చెడెను
చేపతల్లి సుఖము చెప్పెదమేమని
స్వేతబకము చేరి చెఱువునేల.
ఆ:వె. గురునిచెంత జేరి గురుతెరింగె ననగ
మోహమేల పోదు దేహి విడచి
వలకుజిక్కినట్టి పులుగుబాధలు వీడ
పంజరంపు పక్షి పాటు బడునె
ఆ:వె. హరియె వైద్యుడౌచు నవతరించె ననగ
మూత్రపిండమెట్లు మోసమయ్యె
వృత్తిమీది భక్తి వుత్తుత్తిదై పోవ
దయ్యమౌనుగాదె దైవమైన
ఆ:వె. తెలివి మీరిపోయి కలిమికమ్ముడుపోయి
ధర్మహని మాట తగునె పలుక
కటికకొంప కీడ్చి కత్తులు ఝు ళిపించి
గోవుపాల కేడ్వ గుణము గలదె.
***
SEARCH: NISTURA NIZAM
No comments:
Post a Comment