Showing posts with label నా భారత దేశం. Show all posts
Showing posts with label నా భారత దేశం. Show all posts

Sunday, 23 August 2020

నా భారత దేశం

 నా భారత దేశం


నా భారత ధాత్రి దివ్య - పుణ్యధామ మణుమణువు

నా భరతజాతిఖ్యాతి - వినువీధిన కెగసి మెఱయు

 

సితకపోత పక్షతాళ -  శాంతిధ్వనిత మీ నభం

అహింసయుధంపు ధగద్ధగ లలిమిన దీతలం

దేశభక్తి తావి నిండి - వీచు నిచటి మారుతం

శాంతి సహన సంయమనం - ఈ జాతికి సహజగుణం.. //నా భారత//

 

ఇచ్ఛవచ్చు మతమునందు - స్వేచ్ఛగ జీవింతురిచట

అన్నదమ్ము లనగ జనులు - హాయిగ విహరింతురిచట

భాషలు వేరైనగాని - భావమేమొ ఒకటె యిచట

పుడమిలోనె పుణ్యభూమి - భరతావని యన ముచ్చట .//నా భారత//

 

ఈ జాతిన చిచ్ఛుబెట్టి - విద్వేషం రగిలించి

భాషపేర మతంపేర - మనసు విరచు ధూర్తులు

జాతి కన్ను విచ్చిజూడ - తుత్తునియలు కాకపోరు

ఈ జాతికి యేనాటికి - తరుగులేదు తిరుగులేదు.        //నా భారత//

--OOO--

Naa Bharata Desam



పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...