Showing posts with label నరకలోక శిక్షలు. Show all posts
Showing posts with label నరకలోక శిక్షలు. Show all posts

Saturday, 3 October 2020

నరకలోక శిక్షలు

 

నరకలోక శిక్షలు

(గరుడ పురాణము ప్రకారము)





         ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ

 దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన

పురాణాలు ఉద్బోధిస్తునాయి. ఈ భోగదేహం రెండురకాలు,
ఒకటి సూక్ష్మ శరీరం:  ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను

అనుభవించడానికి స్వర్గాది ఊర్ద్వ లోకాలకు చేరుతుంది.
రెందవది యాతనా దేహమ :  ఇది మానవుడు చేసిన పాప ఫలాలను నానా విధాలుగా అనుభవించడానికి నరకాది లోకాలకు చేరుతుంది. మృత్యువు తరు వాత వెంటనే కొత్త దేహం ధరించటం వీలుకాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి మనోమయ ప్రాణమయ దేహం చేత, సుకృత, దుష్కృత సుఖ దుఃఖాల ఫలి తాలను అనుభవించే వివిధ శిక్షలు వాటిని అమలు చేసే 28 నరకాల వర్ణనఉన్నది.
                                                      వాటి సంక్షిప్త వివరణ

01. తామిస్ర నరకం : పరధనాపహరణ, పరస్త్రీ, పరపుత్రహరణం వలన ఈ నరకం పొందుతారు. ఇక్కడ అంధకార బంధురమున పడవేసి కఱ్ఱలచే బాదుతారు.

02. అంధతామిస్ర నరకం :  మోసగించి స్త్రీలను ధనమును పుచ్చుకున్నవారు  కళ్ళు కనిపించని యీనరకమున నరికిన చెట్లవలె పడిపోవుదురు.

౦౩. రౌరవము :  ఇరర ప్రాణులను చంపి తన కుటుంబమును పోషించుకున్న వారిని ఇక్కడ రురువులు అను జంతువులు పాముల కన్న ఘోరముగా హింసించును
04. మహారౌరవ :
  ఇతర ప్రాణులను బాధించి తన శరీరాన్ని పోషించుకొనేవాడు ఈ నరకానికి చేరుతాడు. పచ్చి మాంసము తిను రురువులు హింసించెదరు.
05. కుంభిపాకనరకం :
  సజీవంగా ఉన్న పసుపక్ష్యాదులను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఈ నరకాన్ని పొందుతాడు. ఇక్కడ సలసల కాగే నూనెలో పడవేయుదురు.
06. కాలసూత్ర నరకం :
  తల్లిదండ్రులకు, సజ్జనులకు, వేదానికి ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకాన్ని పొందుతారు. రాగి నేల కలిగి, నెత్తిన నిప్పులు చెరుగు సూర్యుడు మాడ్చివేయుచుండును
07. అసిపత్ర వనము :
  ఆపద సమయములందు కాక ఇతర సమయముల వేదములను ధిక్కరించినవారు ఈ నరకాన్ని పొందుతారు. కొరడాలతో గొడ్డును బాదినట్లు బాదుచు, సర్వాంగములను కత్తులతో కోసి ఈ శిక్షలను అమలుపరచుదురు
08. సూకర ముఖము :
  దండించదగని వారిని దండించిన రాజులను చెరుకు గడలవలే గానుగలలో పెట్టి తిప్పుదురు.
09. అందకూపము :
  నల్లులు మున్నగు వాటిని చంపిన వారిని పాములు, నల్లులు, దోమలు, చీమలు హింసించును
10. క్రిమి భోజనం :
  అతిధులకు అభ్యాగతులకు అన్నం పెట్టక తన పొట్ట నింపుకొనువాడు క్రిములతో నిండిన లక్షయోజనముల కుండలో పడవేయబడును
11. సందశన :
  ఆపదలేకనే సజ్జనులధనము, ఇతరుల బంగారము, రత్నములు దోచుకున్న వారిని మండుతున్న కడ్డీలతో పొడుచుట, పటకారుతో చర్మము పీకుట వంటి శిక్షలు అనుభవించెదరు
12. తప్తసూర్మి :
  సంభోగించరాని ఆడదానితో సంభోగించిన మగవారు అట్టి మగవారితో సంభోగించిన స్త్రీలు మండుచున్న ఇనుప పురుష మూర్తిస్త్రీలచే, స్త్రీమూర్తి పురుషులచే కౌగిలింప చేయబడుదురు
13.
  వజ్రకంటక శాల్మలి :  పశువులతో సంభోగించినవాడు ముళ్ళున్న బూరుగుచెట్టు మీదకి ఎక్కించి కిందకు లాగబడును
14. వైతరణి :
  కులమర్యాద పాటించని రాజు లేక రాజోద్యోగి, చీము, నెత్తురు, తలవెంట్రుకలు, గోర్ళచే నిండి ఉండు నదిలోత్రోయబడును
15. పూయాదన :
  శౌచము,ఆచారము పాటించని వారిని మలమూత్రాదులచే నిండిన చెరువున పడవేయుదురు
16. ప్రాణరోధ
  :  కుక్కలను, గాడిదలను పెంచి, వేటనే వృత్తిగా పెట్టుకున్న బాహ్మణులను అంపకోలలచే వేటాడుదురు
17. వైశాన :
  దంభయజ్ఞములు చేసి పశువులను హింసించువారు ప్రాణాంతకమైన రకరకాల యాతనలను అనుభవింతురు
18. లాలాభక్ష :
  కులభార్యచే వీర్యపానము చేయించువారిచే వీర్యపానము చేయింతురు
19.
  సారమేయోదనము : ఇండ్లు తగులపెట్టుట, విషము పెట్టుట, బిడార్లు దోచుట, గ్రామములను దోచువారిని వజ్రములవలె కరకుగావున్న కోరలుగల ఏడువందల జాగిలములు పీక్కొని తినును 
20.
  అవిచిమంత : అబద్ద సాక్ష్యాలను చెప్పినవారు, లావాదేవీలలో బొంకిన వారు వంద యోజనముల ఎత్తయిన పర్వత శిఖరముల నుండి పడద్రోసి పచ్చడి చేయబడుదురు.
21. ఆయాఃపానము :
 వ్రతనిష్ఠతో వుండి మధ్యపానము చేసిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులచే  కరికిగిన  ఇనుమును త్రాగింతురు.
22. క్షారకర్దమ :
  తమకన్న అధికులను, తిరస్కరించువారిని తలక్రిందులుగా పడద్రోసి నానా బాధలు పెట్టుదురు
23. రక్షోగణబోధన :
 నరమేధములు చేయువారిని, నరమాంసము, పసువుల మాంసము తిను స్త్రీలను, వాడిగల ఆయుధములచే ముక్కలు ముక్కలుగా కోసి కేరింతలు పెట్టుదురు
24. శూలప్రోతము :
  నిరపరాధులైన అడవి జంతువులను ఊరపశువులను నమ్మించి పొడిచి చంపినవారు శులములచే పొడువబడి ఉరి కంబములకు  ఎక్కింపబడుదురు
25. దడసూకర :
  ప్రాణికోటికి భయము కలిగించు ఉగ్రస్వభావులను అయిదు తలల పాములు ఏడు తలల పాములు ఎలుకలను హింసించునట్లు హింసించెదరు
26. అవధినిరోధన :
 గదులలోనూ, నూతులలోనూ ఇతరులను బంధించినవారిని విషాగ్నులు మండించి విషపు పొగలు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేయుదురు
27. పర్యావర్తన :
  అతిధులను, అభ్యాగతులను గద్దించిన వారిని కనుగ్రుడ్లను కాకులచే, గ్రద్దలచే పొడిపింతురు
28. సూచిముఖి
  :  ధన మదాంధముతో అందరిని చిన్న చూపు చూసిన వారిని శరీరమును సూదులతో బొంతనువలే కుట్టుదురు.






పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...