నమస్కారము
ఆంగ్ల మూలం : శ్రీ సిద్ధార్థ దేవ్ తెలుగు సేత : శ్రీ పి. సుబ్బరాయుడు
విషయ సూచిక
1. ముందుమాట
2. పెద్దల ఎదుట సాగిలబడి
ప్రణామమాచరించుటలోగల అంతరార్ధము మరియు ప్రయోజనములు
3. ఏది
సరైన మరియు శాస్త్రవమ్మతమైన దైవ నమస్కారము?
4. నమస్కార
ముద్రల ప్రభావము
5. పెద్దలకు
నమస్కరించుట
6. మహాత్ములకు
నమస్కారము చేయు సరియైన విధానమేమి?
7. మహాత్ముల పాదుకలకు (చెక్క
చెప్పులకు) నమస్కారము చేయుటెట్లు?
8. శవమునకు నమస్కరించవచ్చునా?
9. గుడి మెట్లను ఒక చేతితో
స్పృశించుట
10. నమస్కారము
చేయునపుడు చేయదగిన మరియు చేయకూడని కార్యములు
00000000
ముందు మాట
మనిషిని మనిషి గౌరవించడానికి పెద్దల యెడ
వినయ విధేయతలు ప్రదర్శించడానికి నమస్కారమొక మాధ్యమం. ఈ ప్రక్రియను మినహాయించి జీవన
వ్యవహారాన్ని ఊహించనే ఊహించలేము. ఒక్కో జాతి ఒక్కోదేశం ఒక్కో విధానాన్ని
అనుసరిస్తూ వుండవచ్చు కాని, భావం ఎదుటి వ్యక్తి ఘనతను మనసారా
అంగీకరించి తలవాల్చడమే.
అయితే దీని ప్రయోజనం ఇంతమాత్రమే కాదని, భరతీయ నమస్కార విధానం లో ఎంతో అంతరార్ధం ఇమిడి యున్నదని
ఆధ్యాత్మిక ప్రగతికెంతో తోడ్పడుతుం దని శాస్త్రీయ దృక్పధంతో పరిశీలించి శ్రీ
సిద్ధార్ధదేవ్ గారు వివ రించారు
భారతీయ తెలుగు పాఠకుల ప్రయోజనార్థం దేవ్
గారి ఆంగ్ల వ్యాసాన్ని తెనుగున కనువదించి విడుదల చేయడం జరిగింది. చదివి అందలి విషయ
ముల నెరింగి విజ్ఞానవంతులౌదురుగాక.
విషయ
సేకరణ గావించి, నా చేతి కందించి తెనుగు సేయమని ప్రోత్స
హించిన కడప శ్రీ రాంచందజీ మహరాజ్ సేవా ట్రస్టు, చైర్మన్,
మరియు
ప్రిసెప్టరు అయిన శ్రీ టి.వి. శ్రీనివాసరావు, అడ్వొకేటు గారికి నామనఃపూర్వక వందనములు
ఇట్లు
అనువాదకులు : పి. సుబ్బరాయుడు
10-10-2010.
కడప
దండావత పణామము
పెద్దల ఎదుట సాగిలబడి ప్రణామమాచరించుటలోగల
అంతరార్ధము మరియు ప్రయోజనములు
XXXXXXXXX
నమస్కారమను పదమునకు భాషాపరమైన అర్ధము 'వందనము'.
బాల్యదశనుండి దీనిని సాంప్రదాయకంగా అనుసరిస్తూ వస్తున్నాము. పెద్దల
యెడ గౌరవము, ఆలయములలో
భగవంతుని యెడ విధేయత చూపుటకు వీలుగా బాలురకు నమస్కారమను శిక్షణగా నేర్పుతున్నాము.
ఇదే నమస్కార మును సైనికభాషలో సైనిక వందనం (సెల్యూట్) అంటున్నాము. కానీ జన
సామాన్యము వివిధములైన పద్ధతులలో ఈ నమస్కారము చేయుచున్నారు. పాశ్చాత్య దేశము లోనైతే
మనిషిని మనిషిని వీధిలో దాటుకొని పోవు సమయ ములో తన టోపీని తలనుండి తొలగించి చేతితో
ఊపడమనునది అభినందన గా
పరిగణిస్తారు. భారతదేశములోని అన్ని ప్రాంతపు ప్రజలు ఒకరికొకరు అభి
నందించుకొను సమయములలోను వయోవృద్ధులు, పెద్దలయెడల గౌరవము జూపు
సమయములలోను, ఒకేవిధ మైన పద్ధతిని పాటింతురు. అమెరికాలో
పౌరులు తమ దేశ పతాకమునకు వందనము చేయునప్పుడు తమ కుడి చేతులను హృదయము పై నుంచు కొని
దేశ భక్తిని ప్రకటించు దేశభక్తి గీతాన్నాలపిస్తారు.
సాంప్రదాయ హైందవ వాగ్రూప అభివందనమగు 'నమస్తే' లేదా నమ స్కారమను ఒక ముద్ర ,ఒక అభినయము ద్వారా ప్రదర్శిస్తారు. అదెలాగంటే తమ రెండు చేతులను జోడించి తమ
ఎదవద్ద నిలుపుతారు. ఈ ముద్రనే అంజలీ ముద్ర' అని కూడా
వ్యవహరిస్తారు. ఇది ఒక విధమగు భక్తి ప్రపత్తికి సంజ్ఞగా గుడిలోని దేవునికి,
సాధువులకు, సంతులకు ద్రష్టలకు, పూజారులకు లేక అట్టి పవిత్రులకు,
విద్యావంతులకు, ఉపాధ్యాయులకు మరియు
గురువులకు, వయో వృద్ధులకు, పెద్దలకు,
లేక క్రొత్తగా పరిచయమైన యితర పెద్దలందరికి కూడా సమానంగా ఈ నమస్కారం
చేస్తారు.
జోడించిన చేతులతో శరీరములోని కుడి
ఎడమ భాగములు రెండూ కలుపబడుతాయి. తద్వారా నరములు నాడుల ప్రకంపనాశక్తులు భక్తి పూరిత
సమస్థితికి వచ్చి సూక్ష్మతను అనుభూతిలోనికి తెస్తాయి. అందువల్ల నమస్క రించు వానిలో
మూడవ నేత్రమైన జ్ఞాననేత్రము విచ్చుకొని ఎదుటివ్యక్తి లోని దైవాన్ని అర్చిస్తాడు. ఈ
నమస్కారము ఈ అంజలీ ముద్రవల్ల కలుగు ప్రయో జనాలనిప్పుడు గమనిద్దాము. ఇవన్ని ఒక
పరిశోధకుడు పరిశోధన ద్వారా, సాగిలపడుట, మొక్కుట, సాష్టాంగ
ప్రణామము చేయుట యందలి అంత రార్థమును, విలువలను గ్రహించి
తెలియజేసి యున్నారు. ఈ క్రింది వ్యాసం ములో శ్రీ సిద్ధార్థదేవ్ గారు సహజవిలువలను
శాస్త్రార్థాన్ని రంగరించి ప్రాచీన భరత ఖండాంతర్గత సదాచారములను మన కందిస్తున్నారు.
సాగిలపడు వ్యక్తి ఎప్పుడు కూడా తూర్పు
ముఖంగానూ, వందన గ్రహీత పడమటి ముఖంగానూ వుండుట శ్రేయస్కరమని తెలుపబడింది. చదువరులు ఈ
చిన్న విషయమైనా ముందు గ్రహిస్తే నమస్కారములోని అంతరార్థము గ్రహించటానికది ఎంతగానో
ఉపకరిస్తుంది. ఒకరినొకరు అభివందనం చేసు కోవడమనేది కాలపరిధులకందని అత్యంత పురాతన
ప్రక్రియ.
నమస్కారమను పదము నమః అను మూల పదము నుండి
యేర్పడి నది, దాని అర్ధము దండము పెట్టుట లేక వందన మాచరించుట. శాస్త్రానుసారము 'నమః' అనగా నీవు నాకంటే అర్హతలన్నింటియందు అన్ని
విధములా గొప్పవాడివి అని తెలియజేయు ఒక భౌతిక ప్రక్రియ.
ప్రాపంచిక ప్రయోజనములు:- భగవంతునికి గాని, ఒక మహాత్మునికి గానీ
నమస్కరిస్తే మనకు తెలియకుండానే వారి సామర్థ్యము, సద్గుణములు
మన మనస్సును ప్రభావితం చేస్తాయి. తర్వాత మనం వారి స్థాయివరకు ఎదిగి మనల్ని మనం
నముద్దరించుకొంటాము.
ఆధ్యాత్మిక ప్రయోజనములు:-వినయము, అణకువ పెంపొంది అహంభావము తగ్గుముఖం
పడుతుంది. శరణాగతి, విధేయతలగు ఆధ్యాత్మిక భావములు
పెంపొందును. సాత్వికతాంశము వృద్ధినొంది ఆధ్యాత్మిక పురోగతి తీవ్రమగును. ఈ నమస్కార
ముద్రవల్ల సత్వగుణము అధికాధికముగా మనకు లభించును. దేవతలకు, మహాత్ములకు
నమస్కారము చేయుటవలన వారి నుండి వెలువడిన సూక్ష్మ ఆధ్యాత్మిక తరంగములను మనము
గ్రహింతుము. అనగా అవి వారి సాత్విక లేక ఆనందమయ స్పందనలు.
సమ వయస్కులకు నమస్కారము
చేయుటెట్లు? ఒకే వయస్సు కలిగిన
వ్యక్తులు ఎదురైనప్పుడు చేతి వేళ్ళు ఒకదానితో ఒకటి కలిపి బొటనవ్రేలికోనలు అనాహత
చక్రము (రోమ్ము మధ్యభాగము) తగులునట్లుగా వుంచుకొని నమస్కార ము చేయవలెను. ఇది
దేహాంతర్గత ఆత్మయొక్క ఆధ్యాత్మికభావజనితమగు వినయమును వృద్ధిపొందించును.
సత్వతరంగాలను విశ్వాంతరాళంనుండి వ్రేళ్ళు
ఆకర్షిస్తాయి. (అవి ఆంటెనా లాగా పనిచేస్తాయి). మొత్తం శరీరానికి బొటన వేళ్ళు
ద్వారా పంపిణీ గుతుంది. తద్వారా అనాహత చక్రం విచ్చుకొంటుంది. దేహంతర్గత ఆత్మశక్తి
చైతన్యవంత మౌతుంది. దీనకితోడు ఈ విధంగా ఒకరికొకరు నమస్కారం చేయడం వల్ల ఒకరినుండి
మరొకరికి ఆశీర్వాద శక్తి ప్రసాదితమౌతుంది.
ఏది సరియైన మరియు
శాస్త్ర సమ్మతమైన దైవ నమస్కార విధానము ?
అ. భగవంతునకు మొక్కునప్పుడు
చేతులను ఒకదానితో ఒకటి కలుపుము.
1. చేతులు, అదే
అరచేతులు రెండు కలిపినపుడు వ్రేళ్ళను వదలుగా వుంచుము (నిటారుగా బిర్రుగా
బిగబట్టరాదు)
2. వ్రేళ్ళు ఒకదానినొకటి దగ్గరగా వుంచుము. వేళ్ళ మధ్య సందు లుంచకుము
3. బొటన వ్రేళ్ళకు ఇతర వ్రేళ్ళను దూరముగా
నుంచుము.
4. అరచేతిలోపలి భాగములు తగులుకొనిపోకుండా
కొంత వెలితి వుండే ట్లుగా చూచుకొనుము.
సూచన:-- తొలిదశంలో నున్న సాధకునకు ఆద్యాత్మిక భావము చైతన్యవంతము కావడమే ముఖ్యము, కనుక అతనిలోని ఆధ్యాత్మిక భావము ఉత్తేజిత మగుటకు కలిపిన
చేతుల మధ్య
భాగము కొంత ఖాలిగా ఉండుట అవసరము.
కొంత అభివృద్ధి చెందినవారు ఇట్లు చేతుల మధ్య ఖాళీగా వుంచు నియమము పాటించి భావాతీత
ఆధ్యాత్మికత కొరకు ప్రయత్నించ వలసిన అవసరం లేదు.
ఆ. చేతులు జోడించిన తర్వాత తలను ముందుకు వంచవలెను.
ఇ. తలను ముందుకు వంచునప్పుడు బొటన వ్రేళ్ళను భ్రూమధ్యము (కనుబొ
మ్మల మధ్య ప్రదేశము) తాకునట్లు
చేసి దృష్టి, దేవుని పాదములపై కేంద్రీ
కరించుము,
ఈ. తర్వాత వెంటనే ముకుళిత హస్తాలను క్రిందికి దించివేయక మణికట్లు
ఎదపై ఆనునట్లు ఒక నిముషముంచి, నమస్కారము కొనసాగించి చేతులు తర్వాత దించివేయుము.
అ. చేతులు జోడించునప్పుడు బిర్రుగా వ్రేళ్ళు చాచకుము.
అందువల్ల జీవ
మరియు మనోమయ కోశములనుండి వెలువడు సత్వాంశము తగ్గి రాజ
సాంశము పెరుగును. వ్రేళ్ళు వొత్తిడిలేని స్థితిలో వుంచుకొనడమువల్ల సూక్ష్మ
సత్వాంశము చైతన్యవంతమగును. ఈ శక్తి ప్రభావమున దేహాంతర్గత ఆత్మ శక్తివంతమై అలజడి
సృష్టించు దుష్టశక్తులను సమర్ధవంతముగా నెదిరించ
గల్గును.
ఆ. నమస్కార ముద్రలో కలిపియుంచిన వ్రేళ్ళు ఆంటీనా లాగా
పనిచేసి
దైవమునుండి ప్రసారితమైన దివ్య చైతన్యము లేక శక్తిని మనము
గ్రహిం చునట్లును, మనలో ఆశక్తి నిక్షిప్త మగునట్లు చేయును.
చేతుల జోడించి నపుడు వ్రేళ్ళు కూడా ఒకదానికొకటి ఆనుకొని యుండవలెను. లేని యెడల ఆ
సందులలో శక్తి చేరిపోవును. అలా చేరిన శక్తి చెల్లాచెదరై వివిధ దిశలకు
వెళ్ళిపోవును. అందువల్ల ఈ నిక్షిప్తశక్తి
సాధకుని శరీరానికి అందకుండా
ప్రయోజనరహితమైపోతుంది.
ఇ. అరచేతుల మధ్య కొంత ఖాళీగా ఉంచుకోడం
గురించి:
ప్రాధమికదశలో నున్న సాధకుడు
నమస్కారము చేయుట కొరకు చేతులు బోడించునప్పుడు అరచేతుల మధ్య ఖాళీ ప్రదేశ ముండునట్లు
గమనించ మని సలహా యివ్వబడినది. అదే ఉన్నతదశ నందుకొన్న వారు ఈ అర చేతుల మధ్య
ఖాళీ
స్థలముండునట్లు గమనించ వలపిన పని లేదు..
ఈ. చేతులు
జోడించిన తర్వాత కాస్త ముందుకు వాలవలెను.. ఈ ముద్ర వలన బొడ్డుపై వత్తిడి గలిగి
అక్కడ నిక్షిప్తమైవున్న ఐదు జీవ శక్తులు ఉత్తేజితములగును. ఆవిధముగా ఉత్తేజితమైన
శరీర జీవ శకులు. శరీరమును సున్నితము గావించి సాత్విక స్పందనలను అనుకూలంగా
గ్రహించునట్లు చేయును. ఇది తర్వాత ఆత్మశక్తిని (శరీరాంతర్గత దివ్య శక్తిని) జాగృత
మొనర్చి తర్వాత భావనల ప్రేరేపించును. అప్పుడు శరీరము సమర్ధవంతమై భగవదుత్పాదిత
చైతన్యమును స్వీక రించును.
ఉ. బ్రొటన వ్రేళ్ల కొనలను భ్రూమధ్యమును తాకించుము.
(పైనున్న చిత్ర ముల గమనింపుము.. ఈ ముద్ర శరీరాంతర్గత ఆత్మలో శరణాగత భావమును
మేల్కొలుపును. తద్వారా విశ్వవ్యాప్తమైన దైవ సంబంధిత స్పందనలు తగురీతిన
ఉత్తేజితములగును. అవి
ఆజ్ఞాచక్రము (కుండలి లోని 7 చక్రాలలోని 6 వది)
ద్వారా శరీరధారియైన ఆత్మలోనికి ప్రవేశించి సరిగ్గా దీని వెనుక,తలలోపలి భాగములో కుదురుకొనును. ఈ ప్రదేశము చంద్ర, కేంద్ర మరియు సూర్య ప్రవాహముల ప్రారంభ కూడలి. ఈ
ప్రదేశమున కలిగిన సూక్ష్మతర స్పందనల చలనము వల్ల కేంద్ర ప్రవాహము జాగృతము
గావింపబడును. తద్వారా శరీరమంతటా ఈ స్పందనలు వ్యాపించుటకు వీలు కలుగును. అప్పుడు
స్థూల మరియు సూక్ష్మ ధాతువులన్నీ ఒకేసారి శుద్ధ మగుటకు అనుకూల మేర్పడును.
ఊ. నమస్కారానంతరము చేతుల ద్వారా
లోనికి ప్రవేశించిన దైవ చైతన్య శక్తి పూర్తిగా మనలో లీనమగుటకుగాను మనము వెంటనే
జోడించిన చేతులను దించివేయక వాటిని అట్లే కాస్త క్రిందికి రానిచ్చి, ఎదకు మణి కట్లు ఆనుకొనునట్లు చేసి వుంచవలెను.
అనాహత చక్రము ఎద మధ్య భాగమున నున్నది.
సాత్విక స్పం దనలను, ఆజ్ఞాచక్రమునకు అనుగుణముగానే అనాహత
చక్రముకూడా మనలో లీన
మొనర్చును. మణికట్లు ఎదకు
తగులగానే అనాహత చక్రము జాగృతమై సాత్వికతాంశము మనము మరింత ఎక్కువగా గ్రహించునట్లు
చేయును.
నమస్కార ముద్రల ప్రభావము
ఇతర పద్ధతులతో పోల్చి చూస్తే, ఈ పద్ధతిలో నమస్కారము చేయుటవల్ల దైవచైతన్యమును దేహము
అధికాధికముగా స్వీకరించునట్లు తేలినది. అందు వల్లప్రతికూల శక్తులను మిక్కుటముగా
నిర్వీర్య పరచుచున్నది. మనిషిలో నెలకొనివున్న ప్రతికూల శక్తులు నమస్కారము
చేయునప్పుడు భ్రూమధ్యమున ఆనించియున్న బొటన వ్రేళ్ళను
స్పృసించ లేవు (ప్రతికూల శక్తులు సూక్ష్మమై నవేకాని అవి ఒకానొక సమయములో దేహమందు
ప్రవేశించి రూపమేర్పరచు కొనును).
ప్రశ్న:- సాష్టాంగపడునపుడు, నమస్కరించునపుడు పాంప్రదాయ పద్ధతిలో పూజ చేయునపుడు, యజ్ఞము
చేయునవుడు, సోత్రము చేయునపుడు, గురువులను,
దేవతలను దర్శించునపుడు, మెడ చుట్టు వస్త్రమును
కవ్వకొని యుండ రాదనుటకు కారణమేమి?
జవాబు:- మెడ చుట్టు వస్త్రము చుట్టుకొని యుండుటవల్ల విశుద్ధ
చక్రము (గొంతు ప్రదేశము) ఉత్తేజము కాదు. అందుచేత మనుజులు సత్వాంశ - ప్రయోజనము
తక్కువగా పొందుతారు.
ప్రశ్న: ఎప్పుడూ పెద్దలకే నమస్కారము ఎందుకు చేయాలి?
జవాబు:-పెద్దవారు ప్రవేశింపగానే పిన్నవారిలో జీవశక్తి పెరగడం
మొద లవుతుంది. ఎప్పుడైతే పిన్నవారు లేచి నమస్కరిస్తారో అప్పుడది తిరిగి సమ
స్థితికి చేరుకొంటుంది.
(మనుస్మృతి 2-120. మహాభారతం, ఉద్యోగ పర్వం ఆశ్వాసము 38-1 శ్లోకం సంఖ్య 104, 64-66)
వివరణ:- వయోవృద్ధుల ప్రస్తానం క్రమేపి దక్షిణదిశ వైపునకు సాగుతూ వుంటుంది అనగా
యముని స్థానము వైపునకన్న మాట. (మరణము వైపుకు). అతని శరీరము నుండి రజస్తమో
ప్రకంపనలు మిక్కుటముగా వెలువడుతూ వుంటాయి. అట్టివారు పిన్నవయస్కుల సమీపమునకు
రాగానే ఈ ప్రకంపనలు పిన్నవారిని అలజడికి గురిచేయడం ప్రారంభిస్తాయి. ఒక సూక్ష్మ
అయస్కాంత
పరిధి ఇద్దరి మధ్య ఏర్పడుతుంది.
దాంతో పిన్నవారి జీవశక్తి పైకి లాగ బడుతుంది జీవశక్తిలో కలిగిన ఈ ఆకస్మిక చర్యవల్ల
పిన్నవారు వ్యధకు లోనవుతారు. అప్పుడు పిన్న
వారుపెద్దవారికి
నమస్కరించడము వల్ల అతని కుండలిని లోని కేంద్ర ప్రవాహక శక్తి ఉత్తేజితమై అందలి
సత్త్వాంశము వృద్ధి పొందుతుంది. తద్వారా అతనిలో వున్న రజ: స్తమోగుణాంశములు ఉత్తేజితమై సత్యాంశ ప్రభావ
మునకు లోనై పిన్నవయస్కుని జీవశక్తి సమస్థితికి తేబడుతుంది. కనుక వయోవృద్ధులు
రాగానే పిన్నవారు వారికి నమస్కరించడము ఒక ఆనవాయితీగా వస్తున్నది
పెద్దలకు నమస్కరించుట
ప్రయాణమునకు ముందు, ప్రయాణము ముగించుకొని తిరిగి వచ్చినపుడు
ఎందుకు కుటుంబములోని పెద్దలకు
నమస్కరించాలి?
కుటుంబములోని
పెద్దలకు నమస్కరించడమంటే అది ఒక విధంగా పెద్ద వారికి శరణు జొచ్చుటే. ఒకశరీరమందున్న ఆత్మ నమస్కారనిమిత్తము దైవ
త్వము నిండిన పెద్దల ఎదుట తలవాల్చినది అంటే, అప్పుడొక
విధమైన కరుణ భావము దేహమందు జనిస్తుంది.ఈ కరుణ నేరుగా సూక్ష్మశరీరములోనికి
యింకిపోతుంది. ఆ సమయములో మేధోశక్తి ఉత్తేజితమై మణిపూరకచక్రము (బొడ్డు ప్రదేశము) నాశ్రయించియున్న
అయిదు జీవశక్తులు తద్వారాప్రభావిత మౌతాయి. శరీరమంతటా యీ జీవశక్తులు ప్రసారము
కావటమువల్ల ఆత్మశక్తిని మేల్కొల్పుతాయి. ఆత్మశక్తి యొక్క బలంవల్ల కేంద్ర ప్రవాహము
ఉత్తేజితమై, వ్యక్తమై అధ్యాత్మికభావనాశక్తిని అవ్యక్త
అధ్యాత్మికభావనాశక్తిగా పరిణమింపజేస్తాయి. ఈ అవ్యక్త అధ్యాత్మిక భావనాశక్తి సహాయమువలన శరీరగత ఆత్మ
పెద్దల మాధ్యమం ద్వారా తగినంత దివ్యత్వమును విశ్వము నుండి గ్రహిస్తుంది. ఇందుకొరకు
ప్రయాణమునకు సిద్ధమై, ఇల్లు విడుచు నపుడు శరీరగత ఆత్మ
పెద్దలకు నమస్కరించి సత్త్వస్పందనల బలంతో వాతావరణం లోని ప్రతికూల శక్తులనుండి
తన్నుతాను రక్షించుకొనును. అలాగే ప్రయాణం నుండి తిరిగిరాగానే పెద్దలకు నమస్కరించి వారిలోని దైవత్వమును
మేల్కొలిపి, తద్వారా రజస్తామో శబ్దములేమైనా వాతావరణమునుండి
తమలో ప్రవేశించి వెంట వచ్చివుంటే వాటిని విచ్ఛిన్నం గావించుకొనవలెను.
మహాత్ములకు నమస్కారము చేయు సరియైన విధాన మేమి?
1. తలభాగము
పాదముల చెంత నుంచవలెను
బ్రహ్మరంద్రము (నడినెత్తినగల ఏడవ
చక్రము) నుండి అధికాధికముగా చైతన్యమును మనము గ్రహింతుము ఆ బ్రహ్మరంద్రమును
మహాత్యుని పాదములచెంత వుంచలేము గమక నుదిటి పైభాగమైన తల భాగమును వారి పాదముల చెంత
వుంచుదుము. తద్వారా నమస్కరించు వానిలోనికి మహాత్ముని పాదముల నుండి ప్రసరించు
చైతన్యము అధికాధికమగా ప్రవేశించును.
2. నమస్కరించువాని
శీర్షభాగము సరిగ్గా మహాత్ముల పాదముల చెంత ఏ
భాగమున నుంచవలెను?
మహాత్ముని
కాలి బొటనవేలు అధికాధిక చైతన్యమును విరజిమ్ముతుంది. కనక ఇతర పాద భాగములమీద కంటే
బొటన వేలి మీదవే తలను వాల్చాలి. రెండు పాదముల బొటన వేళ్ళు తగిలే అవకాశము లేకుంటే
కుడిబొటనవ్రేలికి తలను ఆనించండి.
3. మహాత్ముని పాద
బొటనవ్రేలికి తల ఆనించి నపుడు చేతులు ఎక్కడుండాలి?
అ. కొందరు వారి చేతులను నడుము వెనక భాగమున ఒకదానితో ఒకటి
బిగించి నమస్కారము చేయుదురు. రెండు బొటనవేళ్ళు తాకడానికి
వీలయితే చేతులతో పాదములను తాకి తలను కుడి బొటన వ్రేలికి ఆనించచవచ్చును. ఒకవేళ
ఒకపాదమే తాకడానికి అవకాశముంటే, చేతులతో పాదమును
తాకి తలను ఆ బొటన వ్రేలికే ఆనించవలెను.
ఆ. కొందరు తమ చేతులను భూమికానించి నమస్కరించెదరు. ఇది తప్పు
మహాత్ముని పాదస్పర్శద్వారా ఆయన పాదములనుండి గ్రహించిన
చైతన్యము రెండు చేతులనుండి భూమిలోనికి వెళ్ళిపోవును.కనుక ఆవిధ ముగా నమస్కరించిన
వానికి ప్రయోజనముండదు.
ఇ. కొందరు తమ చేతులను ఒకదానిపైకొకటి
పోనిచ్చి కుడిచేతితో కుడి పాదమును, ఎడమచేతితో
ఎడమ పాదమును తాకి నమస్కరింతురు. ఇది క్రైస్తవులు తమ చేతులను ఒకదానిపై కొకటి
పోనిచ్చి ఎదపై వుంచుకొని చేయు ప్రార్ధనకు స్థూలమైన అనుకరణయే. దీనికి బదులు కుడి
చేయి మహాత్ముని ఎడమ పాదమును ఎడమ చేయి కుడిపాదమును తాకి నమస్కారము చేయవచ్చును. ఇది అనుకూలము కూడా. ఏది
ఏమైనా ఒకానొక వర్గమునకు సంబందించిన గురువును సేవించునవుడు వారు నిర్దేశించిన
పద్దతిలోనే చేతుల నుంచుట శ్రేయస్కరము.
ఈ. అరచేతులు మహాత్ముని పాదములపై వుండునట్లు మన చేతులను సర్దుబాటు
చేసుకొనవలెను.
మహాత్ముల పాదుకలకు
(చెక్క చెప్పులకు నమస్కారము) చేయుటెట్లు?
మహాత్ముల పాదుకలకు (చెక్క చెప్పులకు నమస్కారము చేయుట
ఎడమ పాదుక
శివపరమాత్మకు, కుడిపాదుక దివ్య శక్తికి ప్రతీకగా
వుండును.
ఎడమ పాదుక భగవంతుని అవ్యక్త రక్షకశక్తి, మరి కుడిపాడుక భగవం తుని అవ్యక్త వివాశక శక్తి. ఈ రక్షక,
మరియు వినాశక దైవశక్తి, పాదుకమీది బుడిపనుండి
ఎక్కువగా పై కెగజిమ్ముతూ వుంటుంది. ఆ బుడి పపై తల వాల్చి నమస్కారము చేసినప్పుడు
కొందరు మానసిక అలజడికి లోనయ్యెదరు. ఆదివారు ఆ బుడిపనుండి ఎగసి వచ్చుశక్తిని భరింప నశక్తులు
గనుక వారికట్లు జరుగును కనుక నమస్కరించు వారు పాదుక ముందుభాగము, అనగా బొటనవ్రేలు పాదుక పై మోపు స్థలమున తను ఆనించుట మంచిది.
శవమునకు నమస్కరింలచవచ్చునా?
ప్రశ్న:- ఒక ఆనవాయితీగా కలియుగంలో మాత్రం పార్థివ శరీరానికి మ్రొక్కు చున్నాము. ఇది
ఒక ఆచారము, ఆనవాయితీయే, దీన్ని
మానివేయ వచ్చునా?
జవాబు:-నమస్కరించడం ద్వారా పార్థివ శరీరమును గౌరవించ వచ్చును, అంతే గాక పెద్దలను గౌరవించు విషయంలో ఒక మార్గదర్శకంగా కూడా
నిలువ వచ్చును. కలియుగంలో ఈ పద్ధతివల్ల భావోద్వేగ స్థాయిలో మేలు కలుగవచ్చును, గాని ఆధ్యాత్మిక స్థాయిలో కాదు.. ఏది ఏమైనా ఈ పద్ధతిని విడిచి పెట్ట
నవసరం లేదు, కానీ దీని నుండి కూడా ఆధ్యాత్మిక ప్రయోజనము
పొందడము నేర్చుకొనవలెను. శరీర గత ఆత్మలలో ఈ సమయంలో సత్త్వాంశము క్షీణించి ఉంటుంది.
ఈ పద్ధతి కలియుగంలో ఒక ఆచారంగా మిగిలిపోయింది. ఏమైనప్ప టికిని భగవంతుడు సర్వవ్యాపి
అనునదొక ఆధ్యాత్మిక భావము. శవ నమస్కార సమయమున కూడా అందలి ప్రధానాంశమైన దైవత్వము
నకు నమస్కరిస్తు న్నామన్న ఆధ్యాత్మిక భావము కలిగి యుండుట అవసరము. అందువల్ల ఆ పార్థివశరీరములోని ప్రధాన దైవత్వం జాగృతమై
మనలను దీవించును. అలా జరగడానికి గల కారణం దైవత్వ
ప్రధాన లక్షణమైన అమరత్వమే. దానికి భౌతిక శరీరానికున్న పరిమితులు లేవు.
ప్రశ్న:- నిద్రించుచున్నవారికి నమస్కరించకూడదంటారు, కలియుగంలో చని
పోయిన వారిని తగిలి నమసరిస్తే వారి హీన మరియు ఆందోళనా
యుక్త ఆశాంతి మనకు సంక్రమిస్తుందా?
జవాబు:- అవును. అలా జరగవచ్చు. అందుకే నమస్కారము చేయునప్పుడు
సరియైన ఆధ్యాత్మిక భావన కలిగియుండుట అవసరము. పార్థివ
శరీరంలో ప్రధాన దైవత్వమునకు నమస్కరిస్తున్నాం గనుక రజస్తమోగుణాలకుమారు ప్రధాన
దైవత్వం మాత్రమే బాగృతమై ఆధ్యాత్మిక భావనను గుణంగా సత్త్వం ప్రసాదింపబడుతుంది. –
గుడిమెట్లను ఒక చేతితో స్పృశించుట.
క్రియ:
కుడిచేతి బొటన వ్రేళ్ళతో మెట్టును తాకి అదే చేతిని తలపైకి పోనిమ్ము
శాస్త్ర వివరణము:- గుడి చుట్ట్యూగల
ప్రదేశమంతయు దైవ ప్రకంపనలచేత ప్రభావితమైయుండును. అది సాత్వికాంశమును వృద్ధి
పొందించును. వ్యాపిం చియున్న ఆ దివ్యత్వపుటెరుకతో పరిసర ప్రాంతములు మెటికలతో సహా
శక్తిచే నింపబడి యుండును. మెట్లెక్కడం ఒక కార్యం. అది శరీరంలోని రజోగుణా న్ని
పెంచుతుంది. కనుక అప్పటికే పెంపొందియున్న రజోగుణం యిలా మెట్లను కుడిచేతి వేళ్ళతో
తాకడంవల్ల వాతావరణంతో పాటు శక్తిని పుంజుకొని
యున్న మెట్లనుండి సాత్వికశక్తి ప్రశాంతతా గుణం శరీరంలోకి
ప్రవహిస్తుంది. ఈ ప్రక్రియతో పాటు శరీరంలో ఉత్తేజితమైన రజోగుణం కూడా సూర్య నాడి
(సూర్క ప్రవాహం) మాధ్యమంగా సమస్థితికి తేబడుతుంది. అనగా ఒక లిప్త కాలం
సూర్యప్రవాహం యొక్క కార్య క్రమం ఆగిపోతుంది. ఈ ప్రక్రియ వల్ల శరీరాంతర్గత ఆత్మ, రజోగుణ ప్రకోపము గల్గించు చర్యలనుండి కూడా సాత్వికాంశము
నభివృద్ధి చేసుకొను పద్ధతిని తెలుసుకొంటుంది. కనుక సరి యైన సాత్విక చర్యలను
అడుగడుగునా ఆచరణలో పెట్టడం అత్యంతావస్యకము. కనుకనే కుడి చేతి వేళ్ళతో మెట్లను తాకి
అదే చేతిని తలపెకి పోనిస్తూ వుండటం పరియైన చర్యయే. మెటికలపైన వుండే ధూళికూడా
చైతన్యశక్తితో ప్రభావితమై వుంటుంది కనుక దానిని మనం గౌరవించి అందుండి కూడా
ఆధ్యాత్మిక
ప్రయోజనాన్ని పొందాలి. మెట్లమీది చైతన్యశక్తి నాచేతి
కంటుకున్న ఈ ధూళిద్వారా నాలో ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తున్నది, అను ఆధ్యాత్మిక భావమును పెంపొందించుకొన్నట్లయిన అది
దేహాంతర్గత ఆత్మకు అధికాధిక మైన మేలు చేకూరుస్తుంది. అదే సమయంలో దేహాంతర్గతఆత్మ
యొక్క అహం
కారము స్వల్పంగా వుంటే అది మరింత మేలు చేస్తుంది.
ఏపనియైనా అహంకారము వీడి అనగా, నేను అన్న భావం
లేకుండా చేస్తే అది అకర్మకర్మగా గణింపబడుతుంది.
నమస్కారము చేయునవుడు చేయదగిన మరియు
చేయకూడని కార్యములు
ప్రశ్న:- నమస్కారము చేయునపుడు కనులెందుకు మూసుకోవాలి?
చేతులు
జోడించి తలవంచినాడంటే అతడు దైవమునకు, లేక
ఎదుటి వ్యక్తిలోని దైవత్వమునకు వందనమాచరించినట్లే. భగవంతునికి గాని లేక యేయితర గౌరవనీయ వ్యక్తికి
గాని నమస్కరించునపుడు కళ్ళు మూసు కొంటాము. అప్పుడది మనల్ని మనలోని భగవంతుని
చూడగలిగేట్లు చేస్తుంది.
ప్రశ్న:- నమస్కారము చేయునపుడు పాదరక్షలు ఎందుకు
వదలి పెట్టాలి?
కూర్చొనేటప్పుడు, భోంచే సేటప్పుడు, నిద్రించేప్పుడు,
దీవించేప్పుడు, గురు వులను, మరియే యితర పెద్దలకు నమస్కరించేప్పుడు, పాదరక్షలు
ధరించరాదు. -- -----( గౌతమ స్మృతి – 9)
1. పాదరక్షలు
రజస్తామో గుణాలను వృద్ధి చేస్తాయి.
2. మిక్కుటమైన
రజస్తమో గుణాలతో వందనము చేయడమనేది కుండలిని
ఆధ్యాత్మిక విధానంలోని కేంద్రము జాగృత
పరచడానికి సహాయపడదు.
3. రజస్తమో
గుణాలవృద్ధి వల్ల సత్త్వాంశమును గ్రహించు సామర్థ్యము తగ్గి
పోతుంది. అందువల్ల నమస్కారము యొక్క ఫలితము
సన్నగిల్లుతుంది.
4. చెప్పులు ధరించి దేవునికి నమస్కరించినట్లయిన
ఆ దేవుని ఆగ్రహము
నకు
పాత్రులయ్యెదరు.
ప్రశ్న:-- నమస్కరించునవుడు ఏవస్తువు పట్టుకొని యుండరాదందురు
ఎందుచేత?
జవాబు
1. నమస్కరించునపుడు ఏదైనా చేతిలో వుంటే, చేతి వ్రేళ్ళు
వాటి కోసలు
వంగి వుంటాయి.
నిటారుగా వుండవు. కనుక సత్త్వాంశము వ్రేలి చివర్ల
నుండి లోనికి
ప్రవేశింపజాలదు.
2. సాధకునివైపు ప్రవహించు సత్త్వాంశము చేతిలోని వస్తువును తగిలి
వెనక్కు మరలును.
ఒక్కొక్కప్పుడు ఆ సత్త్వాంశము మనిషిలోనికి ప్రవే సించుటకు బదులు చేతిలోని
వస్తువులోనికే యిమిడి పోవును.
3. ఒకవేళ చేతిలోని వస్తువు రజోగుణము లేక తమో గుణముతో నిండి వుంటే అప్పుడది చేతిలో వుండగా నమస్కరించడానికి నొసలికి
లేక రొమ్ముకు చేతులు తగిలితే ఆ వస్తువు యొక్క రజస్తమోగుణాలు శరీరం లో
ప్రవేశిస్తాయి. ..
ప్రశ్న:-- నమస్కారము చేయునపుడు పురుషులు తలను కప్పుకోరు,
కానీ స్త్రీలను తలపై మునుగు
వేసుకోమంటారు, ఎందుకు?
పాదరక్షలు ధరించి తలపై వస్త్రముంచుకొని
లేక ఏదైనా వస్తువు చేతిలో పెట్టుకొని నమస్కారము చేయరాదు. కానీ స్త్రీలు మాత్రము
తలపై చీరను ముసుగుగా ధరించి మాత్రమే నమస్కారము చేయవలెను.
( ఆపస్తంబ
ధర్మసూత్ర -- 1:4:14:19.)
నమస్కరించునప్పుడు జోడించిన
చేతులు ఏ చక్రమును తాకుతాయో ఆ చక్రముల వద్ద
కుండలిని జాగృతమవుతుంది. తద్వారా సత్త్వాంశము అధికాధి కముగా శరీరములో
యిముడుతుంది. కొన్ని సమయాలలో కుండలిని జాగృత మన్వడం వల్లసత్త్వాంశము తల ద్వారా శరీరంలోనికి
ప్రవేశిస్తుంది. కాని ఒక్కో సారి ప్రతికూల శక్తులు దీన్ని అనువుగా మలచుకొని
సత్వంతో పాటు దుష్ట శక్తులు కూడా కలిసిపోతాయి. కుండలిని జాగృతపరచే సామర్థ్యం
స్త్రీలలో కంటే పురుషులలో అధికంగా వుంటుంది. కనుక పురుషులు ఈ ప్రతికూల శక్తికి
స్వల్పంగా లోనవుతారు. స్త్రీలు చాలామటుకు సున్నిత దేహులు గనుక వారే ఎక్కువగా ఈ
ప్రతిరూల శక్తులకు సులభంగా లోనై విసుగు చిరాకు పడుతారు, అని మొదట చెప్పిన భావానికి విరుద్ధంగాకూడా భావించడం
జరుగుతున్నది. కనుకనే స్త్రీలను, నమస్కరించునపుడు తమ చీరచెరగు తలకు దుష్టశక్తులకు మధ్య కవచంగా ఏర్పడి
దుష్టశక్తులు లోనికి జొచ్చుకొనిపోకుండా రక్షణ కల్పిస్తుంది. ఐనప్పటికి, ఈ చీరచెంగు శుభకర శక్తిని కూడా కొంతవరకు అడ్డుకుంటుంది. (కానీ శుభకరమైన
స్పందనలు సూక్ష్మతరమైనవగుటవలన తలపైని వస్త్రమునుండి కూడా చొచ్చుకొని దేహం లోనికి
ప్రవేశించగలవు). ఏదిఏమైనా సరియైన నమస్కార ముద్ర అత్యధిక సత్త్వాంశమును
ప్రసాదిస్తుంది గనుక స్త్రీలు సైతం తగినంత ప్రయోజనాన్ని పొందుతారు. దీనివల్ల
భగవంతుడెలా తన భక్తులను సంరక్షిస్తాడో తెలియు చున్నది. భక్తుడు ఆధ్యాత్మిక భావన
కలిగి నమస్కారము చేసినట్లయితే ఈ నిబంధనలు పాటించకపోయి నప్పటికి సమాన ప్రతిభావంతమైన
ప్రయోజనాన్ని పొందగలడు.
( సిద్ధార్థదేవ్, ఇన్స్టిటూట్ అఫ్ క్లాసిక్స్అనాలసిస్ అండ్ రేవలూషన్ గార్గ్ మానస్
ఉనివర్సిటి, అర్లింగ్టన్, అమెరికా )
No comments:
Post a Comment