Showing posts with label వింజామరం. Show all posts
Showing posts with label వింజామరం. Show all posts

Friday, 31 May 2024

వింజామరం

 

వింజామరం



వింజామరం లేక చామరం, చామరమృగం (జడలబర్రె) తోకవెంట్రుకలతో తయారుచేయబడిన వీవన (విసనకర్ర) ఈ వెంట్రుకలు చాలా మృదువైమవి. వింజామరాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. వింజామరతో భగవద్భక్తులు, భగవంతునిసేవగా వీస్తారు. భగవంతునికేమిటి ఉక్కబెట్టడమేమిటి అందుకు వింజమరతో వీయడమేమిటి అనుకోవచ్చు. కానీ ఆసేవచేస్తూ మనిషి హృదయంలో ఒకపవిత్రభావన కలిగివుంటాడు. మిగిలిన ప్రాపంచిక విషాయలను ఆవింజామరసేవ చేస్తున్నంతకాలం మరచివుంటాడు. అది మనిషికి ప్రశాంతతనిచ్చే నిజమైన మేలు. గొప్ప ప్రయోజనము. ఈవింజామరసేవ ముఖ్యంగా జగద్గురువైన శ్రీకృష్ణపరమాత్మ పూజలో చేస్తూవుంటారు. రాధ, గోపికలు యీసేవ ద్వాపర యుగంలో కృష్ణపరమాత్మకుచేసి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారని నమ్ముతారు. సిక్కుమతస్తులుగూడా వారిగ్రంథసాహెబ్ (పవిత్ర గ్రంథం) కు యీవింజామరసేవ భక్తితో చేస్తారు. ముఖ్యంగా హిందువులు ఓజత వింజామరలను ఇంట్లో వుంచుకొనివారి ఇలవేల్పుకు యీ విజామరసేవ సేసుకుంటారు.  ఇంట్లో వింజామరముంటే నకారత్మకశక్తులు నశించి శుభకర సకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయివింజామర వీచడంద్వార వచ్చిన గాలితో ఇల్లునిండిఇల్లు, పరిసరప్రాంతలు పవిత్రతను సంతరించుకుంటాయని హిందువుల విశ్వాసం. తద్వార ఇంట్లోనివారు క్షేమంగా వుంటారని బలంగా నమ్ముతారు. చామరాలు తెల్లనివిగోదుమరంగువినల్లనివికూడా లభిస్తాయి. తెల్లనివి భగవంతుని సేవకు ఉపయోగిస్తారు. అవిశ్రేష్టం. వింజామరపిడిని సామాన్యంగా వెండితో చేస్తారు. సంపన్నులు బంగారంతో చేయించుకుంటారు. ధరతగ్గడంకోసం ఇత్తడి స్టీల్‍తోనూ చేస్తారు. వింజమరలను సింహాలజూలుతోకుడా చేస్తారని వినికిడి. ఉండొచ్చుగానీ సింహలసంఖ్య బహుతక్కువ కనుక సింహపుజూలు వింజామరలు  అరుదు. అసలు జడలబర్రెవింజామరలే దొరకడం కష్టమై సింథటిక్‍విజామరలను చేసి మోసగిస్తున్నారని వింటున్నాము. కనుక కొంత ధరయెక్కువైనా అసలైన వింజామరలు తెలిసినవారి సహయంతో కొనడం మంచిది. వింజామరలను అవసరమైనప్పుడుకుంకుడుకాయసబ్బుషాంపూల నుపయోగించి మంచినీటితో శుభ్రంచేసుకొని చెక్కదువ్వెన లేక బ్రష్‍తో చిక్కుదీసి దైవకైంకర్యాదిశుభకార్యాలలో ఉపయోగించుకోవచ్చును.

  లలితాసహస్రనామావళిలో "సచామర రమా వాణి / సవ్యదక్షిణ సేవితా" అనివుంది. అంటే లలితదేవిని లక్ష్మీసరస్వతులు కుడియెడమల నిలబడి వింజామరలతో విసరుతూ సేవించారనివున్నది. దీన్నిబట్టి వింజామర ప్రముఖ్యం తరతరాలుగా సాగుచున్నదని అర్థమౌతున్నది. అంతేగాక పంచభూతసేవ అన్నదొకటున్నది. అందులోని పంచభూతాలకు ప్రతీకలుగా, 1. చందనం. ఇది భూమికి ప్రతీక. 2. గంట. ఇది ఆకాశ ప్రతీక. 3. దీపారధన. ఇది అగ్నికి ప్రతీక.  4 . తీర్థప్రసాదాలు. ఇవి జలతత్వానికి ప్రతీక ఇక ఐదవది చామరసేవ. ఇది వాయుతత్వానికి ప్రతీక. పవిత్రపంచభూత సేవలో కూడా వింజామరముండటమొక విశేషం. ఇంకా చెప్పాలంటే పూర్వం రాజులు, ఘనతవహించిన స్వామీజీలకు , రాజులకు, రాజ్యానికిఅనేకవిధాలుగా సహాయపడే కొంతమంది ప్రముఖులకు రాజలంఛనాలు, రాజులు తామనుభవిస్తూ వీరికిగూడా అధికారికంగ సమకూర్చేవారు. ఆరాజలాంఛనాలు యేవంటే, మకుటం (కిరీటం), రాజదండం, బంగరుపిడిగల్గిన తెల్లనిగొడుగు, వీటితోపాటు చామరం కూడా వుండేది. అంటే చామరం గలిగియుండి, దానితో సేవింప జేసుకోవడం గొప్పదనానికి గురుతన్నమాట. మామూలుగా దేవాలయలలో యీ చామరసేవ పురుషులు చేస్తారు. వీరిని చమరగ్రాహి, చామరికః, చామరగ్రాహః అని పిలుస్తారు. రాజులు మొదలైనవారి గౌరవార్థం స్తీలు (పరిచారికలు) యీసేవచేస్తారు. వీరిని చమర గ్రాహిణులంటారు.   

 


    వింజామరలు జడలబర్రె రోమాలతో తయారౌతాయన్నాముగదా! ఆ జడలబర్రెనుగూర్చికూడా కొంతతెలుసుకుందాం. దీన్ని ఆంగ్లంలో యాక్ (Yak) అంటారు. ఇవి దక్షిణాసియా, హిమాలయాప్రాంతాలు, టిబెట్ నుండి మంగోలియా వరకువున్న ప్రాంతాలలో పెంపుడు జంతువులుగా పెరుగుతున్నాయి. కొండప్రాంతాలలో కూడా ఇవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వీటిని పాలిచ్చుజంతువులుగా పెంచుకుంటారు. వెంట్రుకలతో వింజామరలు, వస్త్రాలు, ముతకరగ్గులు చేస్తారు. వీటిని బరువులుమోసేందుకు కూడా ఉపయోగిస్తారు. రైతుల ధాన్యన్ని పండ్లు కాయలు, వ్యాపారుల వివిధ వస్తువులను మోస్తూ మంచుకొండల యెత్తులను సులభంగా దాటిదూరప్రాంతాలకు ప్రయాణిస్తాయి. ఇవి కేవలం గడ్డిమాత్రమే మేస్తాయి. రైతుల ధాన్యాలు, పండ్లు ఫలాలు తినవు గనుక రైతులకు నష్టం కలిగించవు. కొన్నిజాతులవారు వీటిని మంసంకోసం కూడా పెంచుకుంటారు. టిబెటియన్‍లకు ఇది ఒకమంచి పాడియావు వంటిది. దీనివెన్నతో చిన్నచిన్న బొమ్మలుచేసి ఉత్సవాలలో పూజిస్తారు. ఈవెన్నతో దీపాలువెలిగించుకొని దైవారధన చేస్తారు. టిబెట్లో దీనివెన్నతో బటర్‍టీ చేసుకొని ఇష్టంగా సేవిస్తారు. జున్నుతో ఛుర్ఫీ అనే పదార్తం చేసుకొని మక్కువతోతింటారు. జడలబర్రెచర్మంతో గుఱ్ఱాల తలపై అలంకరించే తలాటాలు చేస్తారు. వీటి చర్మపుదుస్తులు చలికిబాగ తట్టుకుంటాయి. వెంట్రుకలతో నేసే ముతకవస్త్రాలు చలికితట్టుకోవడానికి డేరాలపైకప్పుగా వాడుకుంటారు. జడలబర్రెవెంట్రుకలు తీసివేసిన కొద్దికాలానికే మళ్ళీ యెపుగా పెరుగుతాయి. మంచుకొండల్లో చెట్లుపెరగవు గనుక జడలబర్రెపేడ పిడకలను అక్కడివారు వంటచెరకుగా వాడుకుంటారు. టిబెట్‍ కారకోరం ప్రాంతంలోను, మధ్యాసియా, పాకిస్తాన్‍లలో యాక్‍స్కీయిగ్, యాక్‍పోలో వంటిక్రీడల్లో జడలబర్రెలను వాడుకొని పోటీలు నడుపుతారు. ఆడజడలబర్రెను నాగ్‍అని మగజడలబర్రెను యాగ్‍అని టిబెట్‍లో పిలుస్తారు. ఇవి చాలావరకు మౌనంగావుండే సాధుజంతువులు. అటవీచమరమృగాల సంఖ్య తగ్గిపోతుండడంతో వాటి పరిరక్షణకోసం టిబెట్‍లో ఒకప్రాజక్టును కూడచేపట్టారు.  ఇదీ వింజామరల వృత్తాంతం.      

 

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...