Showing posts with label పారాణి. Show all posts
Showing posts with label పారాణి. Show all posts

Tuesday, 24 December 2024

పారాణి

 

పారాణి


పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంటే వసంతమౌతుంది. దేవతల ఊరేగింపు చరమాంకంలో వసంతాలు చల్లుకుంటారు. హోలీపండుగలో పిచికారీల్లో వసంతంనింపుకొని చల్లుకొని ఆనందిస్తారు. దిష్టితీయడానికికూడా వసంతం ఉపయోగపడుతుంది. పారాణి ముఖ్యంగా పాదాలకు అందమైనడీజైన్లలో పట్టించుకుంటారు. వివాహాలలో వధూవరుల కిరువురికీ కాళ్ళకు పరాణిపట్టించి ఎఱ్ఱగా అందంగ వుండేట్లు అలంకరిస్తారు. అరచేతులకు వేళ్ళకుగూడా పట్టించి కొద్దిసేపటితర్వత కడిగేసుకుంటే చాలాఅందంగా వుంటాయి. ఆ దంపతులకు యింకా పారాణికూడా ఆరలేదంటే, వారు నవదంపతులని, క్రొత్తగా పెండ్లైనవారని అర్థం. పారణి ప్రకృతిసిద్ధమైంది కబట్టి మనిషికి హానిచెయ్యదు. ప్రస్తుతం వస్తున్న రంగులపారాణివల్ల హానికలుగవచ్చు. కనుక పసుపు సున్నం కలిపిచేసిన పారణి వడుకొని శుభకార్యాలు జరుపుకోవడం యెంతో శ్రేయస్కరం. పారాణి మంగళద్రవ్యం. స్త్రీ ఐదోతనానికి చిహ్నం కూడా. ప్రత్యేకంగా వ్రతాలు, పూజలు చేసుకొనేప్పుడు తాముపారాణిని ధరించడమేగాకుండా, యింటిలోని ఆడవారు వచ్చిన ముత్తైదువుల పాదాలకుగూడా పారాణిపూసి గౌరవిస్తారు.

పసుపు క్రిమినాశిని. పసుపుతోపాటూ సున్నంకూడా పారాణిలో వుంటుందిగనుక. ఇది తీవ్రమైన క్రిమిసంహరకం. ఘాటుగావుంటుంది గనుక పారాణిముద్దను గోరుచుట్టు, పిప్పిగోళపైపట్టించడంవల్ల యీగోళ్ళవ్యాధులు నయమౌతాయి.

మరింత ఎఱ్ఱగా అందంగా అలంకరించుకోవడానికి రెడిమేడ్ పారాణిపాకెట్లు మార్కెట్లో యిప్పుదు దొరుకుతున్నాయి. అంతేగాకుండా ఇంట్లోనే రెండుమూడు రకాలుగా పారాణిని తయారుచేసుకుంటారుకూడా. మేలైన కుంకుమలో నిమ్మరసం కలిపి చిక్కనిద్రవంగా చేసుకొని, ఇయర్‌బడ్ సహాయంతో వివిధడిజైన్‌లలో పారణిగా పాదాలపైన, అరచేతులపైనా వేసుకుంటారు. ఇంకోరకమైన పారాణి యిలా చేసుకుంటారు. ఒకమెటల్‌పాత్రమధ్యలో ప్రమిద బోర్లించిపెట్టి ప్రమిదచుట్టూ టెంకాయచిప్ప చిన్నచిన్న తుంటలుగానీ లేదా బెల్లంపొడిగానీ పెట్టి ఒకచిన్న ఖాలీస్టీల్‌గ్లాసును, ముందు బోర్లించిపెట్టిన ప్రమిదపై పెట్టాలి. తర్వాత ముందుగాపెట్టిన పాత్రవంటి మరోపాత్రను మొదటిపాత్రపై పెట్టి తడిపిపెట్టికున్న మైదాతోగానీ బంకమట్టితో గానీ రెండుపాత్రల మధ్యనుండి గాలిపోకుండా సీల్చేయాలి. తర్వాత పాత్రలోని వస్తువులు కదలని విధంగా జాగ్రత్తగా పొయ్యి మీదపెట్టి పైపాత్రలో చల్లనినీరుపోసి పొయ్యివెలిగించి మంటపెట్టాలి. పైనపెట్టిన పాత్రలోని నీరు బాగా మరిగేవరకు మంటపెట్టి, తర్వాత పాత్రలు చల్లబడేవరకువుండి, పాత్రలసీల్ తొలగించి పైపాత్రను తొలగించిచూస్తే స్టీల్‌గ్లాసులో ఒకరకమైన ద్రవం వుంటుంది. ఆద్రవాన్ని కొద్దిగాతీసుకొని అందులో మంచికుంకుమ వేసి చిక్కగా కలుపుకొని పారాణిగా వాడుకొనవచ్చును. దీనివల్లకూడా యేహానీ వుండదు.

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...