This website contains Telugu Articles, Poems, stories etc. related to Telugu Literature. https://subbarayasaahityam.blogspot.com/
Sunday, 4 October 2020
పాట (Bahubali song similar tune)
పాట
అతడు: చలియ నీచూపులే – మరుని విరితూపులై
వదలకెద తాకుచూ – మరులు గొలిపేనులే
ఆమె: మరువలేనో సఖా – మదిని నీ రూపమే
కదలకే నిలిచెలే - వదలనే నిన్ననీ
అతడు: చూకి వనశారికన్ – నీవేయని తలచితి
చిలిపిగోరింకనై - జంట మనమంటిని
ఆమె : కడిమితరు వీవనీ – తలచి తమిదీరగా
మల్లెలతనైతిని - అల్లుకొనిపోతిని
అతడు: కాంచి తిలపుష్పమున్ – నాశికిది నీదనీ
మేను పులకింపగా - వ్రేల స్పృసియించితి
ఆమె: కళలవెలుగొందు నీ – వదనశశి గాంచగా
కొలని కల్హారమై – విచ్చుకొని మురిసితీ
అతడు: బింబఫల మారసి – అధరమిది నీదనీ
చేరిముద్దాడితి – వలచి మైమరచితి
ఆమె: సరసి కమలమ్మునై – మధుపమున నినుగని
మధువునే గ్రోలగా – మనసుబడి పిలచితి
అతడు : విరులు పరిమళములు – విడిచి క్షణమైనను
ఉండ లేనట్లుగా – జగతి మన ముందము
ఆమె : కాంతి దీపమ్ముతో – కలిసియున్నట్లుగా
ఒకరితో నొకరము – కలిసిపోదములే
రచన—పి. సుబ్బరాయుడు
(బాహుబలి--పచ్చబొట్టేసిన..మాదిరి
పాట)
-
వేమన , వీరబ్రహ్మం , అన్నమయ్యల తాత్త్విక చింతన తత్త్వముఅన్నపదం తత్- తమ్ పదముల కలయికతో ఏర్పడింది తత్ అంటే అది. అదిబ్రహ్మము . ...
-
వికర్ణుడు కౌరవులు నూరుగురు . అందులో దుర్యోధనుడు , దుశ్శాసనుడు అందరికీ తెలుసు . ఆతెలియడంకూడా దుష్టులుగా తెలుసు . కానీ కౌరవులలో ఒక ధర్మాత్ము...