కర్పూరం
కర్పూరాన్ని కపురం, కప్పురం
అనికూడాఅంటారు. కర్పూరంచెట్లు చైనా, జపాన్, దేశాల్లోను, భారత్‍లోని నీలగిరికొండల్లోనూ, మైసూర్, మలబార్ ప్రాంతాలలోనూ ఎక్కువగా పెంచుతున్నారు.
హారతికర్పూరం, పచ్చకర్పూరం అందరికితెలిసిన
కర్పూరాలు. కర్పూరంలో చాలారకాలున్నాయి.
ఘనసారం, భీమసేనం, ఈశానం, ఉదయభాస్కరం, కమ్మకర్పూరం, ఘటికం,
తురుదాహం, తుషారం, హిమరసం,
హారతికర్పూరం, శుద్ధం, హిక్కరి,
ప్రోతాశ్రయం, పోతాశం, సితాభ్రం,
యీ కర్పూరరకాలు. కర్పూరంచెట్టు వేళ్ళు,కొమ్మలు,
ఆకులు నీళ్ళలో మరిగించి డిస్టిలేషన్ పద్దతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరమంటారు.
దీన్ని ముఖ్యంగా లడ్డూలాంటి తీపిపదార్తాల్లోను
ఔషదాల్లోనూ, కాటుకలు, అంజనాలు
తయారుచేయడానికి వాడుతారు. బీమసేనికర్పూరం, చెట్టుకొమ్మలకు
గాట్లుపెట్టి, వాటినుండి స్రవించే పాలతో తయరుచేస్తారు. కనుక
దీన్ని అపక్వకర్పూరం అనికూడా అంటారు. ఇది ఔషదాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
హారతికర్పూరం టర్‍పెంటైన్ నుండి రసాయనిక ప్రక్రియద్వరా తయారుచేస్తారు. ఇది
కృత్రిమకర్పూరం. దీన్ని ఔషదాలలో వాడరు. రసకర్పూరమని మరొకటున్నది. దీన్ని ఆముదంతో
కలిపి చిన్నపిల్లలకు కడుపులోనికిస్తారు. శరీరంలోని దోషాలన్నిటిని ఇది పోగొట్టి దేహరక్షణ గావిస్తుంది.
వైద్యపరంగా కర్పూరపు ప్రయోజనాలు చాలాఎక్కువ. కర్పూరం ఎక్కువమోతాదులోకాకుండా కొద్దిమాత్రమే సేవించాలి. లేకపోతే దానిఘాటువల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదంవుంది. కర్పూరం సేవిస్తే స్వల్పహృదయసమస్యలు, అలసట తగ్గిస్తుంది. కీళ్ళనొప్పులు, నరాల నొప్పులు, బలహీనత, వీపు నడుంనొప్పులకు నూనెలో కర్పూరం కలిపి మర్థన చేయడంద్వారా ఉపశమనం కలుగుతుంది. అందుకే చాలారకాల నొప్పినివారణ ఆయింట్‍మెంట్లలో దీన్ని వాడుతున్నారు. పుండ్లుమానడానికి, పిల్లల్లోవచ్చే గజ్జి తామర నయంచేయడానికి కూడా యీనూనెను ఉపయోగిస్తారు. కుష్ఠురోగుల పుండ్లను కూడా యీనూనె మాన్పుతుంది. కర్పూరం వాసనచూస్తే నాశికాసమస్యలు, ఊపిరితిత్తులసమస్యలు తొలగిపోతాయి. రెండుపలుకుల కర్పూరం నోటిలోవుంచుకుంటే, దప్పిక తగ్గుతుంది. నోటిదుర్వాసనా తగ్గుతుంది. సారాయిలో కర్పూరం కలిపి సంతృప్త ద్రావణంగా తయారుచేసుకొని చితికెడుచెక్కెరలో రెండు చుక్కలు యీ ద్రావణం వేసుకొని సేవిస్తే, నీళ్ళవిరేచనాలు తగ్గుతాయి. కలరావ్యాప్తి సమయంలోకూడా దీన్ని నివారణమందుగా వాడుకోవచ్చు. కర్పూరసువాసన కామకోరికలను అదుపులోవుంచుతుంది. అంతేగాక పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఎండుద్రాక్ష సమభాగాలుగాతీసుకొని కలిపినూరి బఠాణీలంత మాత్రలు చేసుకొని రాత్రిపడుకోబోయే ముందు ఒకగ్లాసు పాలతో సేవిస్తే మగవారిలో లైంగికశక్తి పెరుగుతుంది. కర్పూరం రోజ్‍వాటర్‍తో కలిపి మర్మావయాలకు పట్టించి 15 నిముషాల తర్వాత కడిగేస్తే మర్మాయవాలదురదలు తగిపోతాయి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే సరిపోతుంది. ఉబ్బసం తీవ్రంగావుంటే బెల్లం కర్పూరం సమపాళ్ళలోకలిపి కొద్దికొద్దిగా సేవిస్తే తీవ్రాత తగ్గుతుంది. నీళ్ళలో కాస్తా కర్పూరంపొడి చల్లి ఆనీళ్ళతో స్నానంచేస్తే శరీరంపైనుండే బ్యాక్టీరియా నశించి, చర్మంశుభ్రంగా వుంటుంది. కర్పూరంపొడిని కొబ్బరినూనెలో నానబెట్టి తలకుపట్టిస్తే చుండ్రు పోతుంది. ఉతికిన బట్టలమధ్య కాస్తా కర్పూరం వేసి పెడితే రిమటలు దరిదాపుల్లోకి రావు. కర్పూరం రెండుభాగాలు, వాముపువ్వు ఒకభాగం, మెంథాల్ (పెప్పరమెంటుపువ్వు) ఒకభాగం సీసాలోవేసేస్తే అదే ద్రవమై పోతుంది. దీన్ని అమృతధార అంటారు. రెండుచుక్కలు అమృతధార చిటికెడుచెక్కెరలో వేసుకొని కడుపులోకి సేవిస్తే, ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. దగ్గుతగ్గుతుంది. నీళ్ళవిరేచనాలు తగ్గిపోతాయి. తలనొప్పులకు, వాపులకు బెణికిననొప్పులకు, పైపూతగా బాగా పనిచేస్తుంది. ముక్కుపైన వీపుపైన మాటిమాటికి పట్టిస్తూవుంటే, జలుబు రొంప రొమ్ముపడిశం తొందరగా తగ్గుతుంది. కడుపుపైన రుద్దుతే, ఉబ్బరం తగిపోతుంది. దెబ్బతగిలినవెంటనే గాయంపైన దూదిపై నాలుగుచుక్కలు అమృతధార వేసి పెడితే రక్తంకారడం వెంటనే తగ్గిపోయి, తొందరగా పక్కుగట్టి మానిపోతుంది. చిటికెడుబీయ్యంలో కాస్త కర్పూరమేసి చేతిగుడ్డలో ఒకకొసన మూటగాకట్టి జలుబు పడిశంలో ఇన్‍హేలర్‍గా వాడుకొనవచ్చు. ఇలా చాలా ఉపయోగాలున్నాయి కర్పూరంతో-
No comments:
Post a Comment