మామిడాకులు
మామిడాకుల
తోరణాలు కట్టనిదే హిందువుల యే శుభకార్యమూ జరగదు. పండుగల్లో, వ్రతాల్లో, యాజ్ఞయాగాదుల్లో, ఆలయద్వజారోహణల్లో,
వివాహాదిశుభకార్యాల్లో, పందిళ్ళకు, మంటపాలకు,
తలవాకిళ్ళకు మామిడితోరణాలు కట్టవలసిందే. కలశంలో కూడా మామిడాకులుంచడం
సర్వసామాన్యం. మామిడాకుల్లో లక్ష్మీదేవి కొలువుంటుందని మనవారి నమ్మకం. అందుకే
మామిడాకుల మంగళతోరణాలు కట్టిన ఇంట్లోగానీ మంటపాల్లోగానీ లక్ష్మీదేవిఅనుగ్రహం
మెండుగా వుంటుంది. మామిడాకుల ప్రస్తావన భారత రామాయణాల్లోకూడావుంది క్రీ.పూ 150
సంవత్సరాల నాడే సాంచీస్తూపంపై ఫలించిన మామిడి వృక్షం చెక్కబడింది.
ఉగాది పచ్చడిలో మామిడికాయముక్కలు తప్పనిసరి. మామిడిచెట్టు భక్తి ప్రేమలకు ప్రతీక.
ఈచెట్టు సృష్టికర్త బ్రహ్మకు సమర్పింబడినదని, దీని పువ్వులు చంద్రునికి
సమర్పింపబడ్డాయని హైందవవిశ్వాసం. కాళిదాసు దీన్ని మన్మథుని బాణాల్లో ఒకటిగా
వర్ణించారు. శివపార్వతుల వివాహం ఒక ఇతిహాసానుసారం మామిడిచెట్టు క్రిందేజరిగింది.
హనుమంతునివల్ల మామిడి భారతావనిలో వ్యాప్తిజెందిందని పండితులు చెబుతున్నారు. హనుమ
మామిడి సువాసనకు ఆకర్షితుడై మామిడి ఫలాలను భుజించి, ముట్టెలను
సముద్రంలో విసిరేశాడట, అవి బారతభూభాగానికి కొట్టుకవచ్చి
చెట్ట్లుమొలిచి వ్యాపించాయట. మామిడాకులు కట్టినయింటికి వాస్తుదోషం తగలదు.
సకారాత్మకశక్తుల ప్రవేశం, నకారాత్మకశక్తుల తిరోగమనం జరిగితిరుతుందంటారు.
కనుక పట్టిందల్ల బంగారమౌతుంది. మామిడాకులు
తోరణం కట్టినచోట మనస్సుకు ప్రశాంతత జేకూరుతుంది. ఆప్రదేశంలో ప్రాణవాయువుశాతం
పెరిగి స్వచ్ఛత నెలకొంటుంది. ప్రతిదీ శుభప్రదమౌతుంది. రోగకారక సూక్ష్మజీవులు నశించించడంవల్ల
ఆరోగ్య పరిరక్షన జరుగుతుంది. మామిడాకులు యేకారణంచేతనైనా దొరక్కపోతే రాగి, జివ్వి, మర్రి ఆకులతో తోరణాలు కట్టూకోవచ్చు. మామిది,
జివ్వి, రాగి, మర్రి,
ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. వీటన్నిటినీ హిందువులు పవిత్రంగా
భావిస్తారు. పూర్వకాలంలో పెళ్ళికిముందు వరుడు మామిడిచెట్టుకు పసుపుకుంకుమలతో
పూజించి ప్రదక్షిణచేసి చెట్టును కౌగలించుకొని తర్వాత పెళ్ళిమంటపం ప్రవేసించే వాడట.