నా భారత దేశం
నా
భారత ధాత్రి దివ్య - పుణ్యధామ మణుమణువు
నా
భరతజాతిఖ్యాతి - వినువీధిన కెగసి మెఱయు
సితకపోత
పక్షతాళ - శాంతిధ్వనిత
మీ నభం
అహింసయుధంపు
ధగద్ధగ లలిమిన దీతలం
దేశభక్తి
తావి నిండి - వీచు నిచటి మారుతం
శాంతి
సహన సంయమనం - ఈ జాతికి సహజగుణం.. //నా భారత//
ఇచ్ఛవచ్చు
మతమునందు - స్వేచ్ఛగ జీవింతురిచట
అన్నదమ్ము
లనగ జనులు - హాయిగ విహరింతురిచట
భాషలు
వేరైనగాని - భావమేమొ ఒకటె యిచట
పుడమిలోనె
పుణ్యభూమి - భరతావని యన ముచ్చట .//నా భారత//
ఈ
జాతిన చిచ్ఛుబెట్టి - విద్వేషం రగిలించి
భాషపేర
మతంపేర - మనసు విరచు ధూర్తులు
జాతి
కన్ను విచ్చిజూడ - తుత్తునియలు కాకపోరు
ఈ జాతికి యేనాటికి - తరుగులేదు తిరుగులేదు. //నా భారత//
--OOO--
Naa Bharata Desam
No comments:
Post a Comment