గండికోట
ఇదెగండికోట ఇదె గండికోట
పెన్నకొట్టిన గండి గట్టునానిలబడి
వీరచరితల సాక్షమై- నిలచె నీ కోట
అరిరక్తసిక్త కరవాలములు గడుగ
ఎఱ్ఱబారిన యట్టి కొలను గల కోట. // ఇదెగండికోట //
స్వేతకిటియై హరి ప్రత్యక్ష మై పలుక
కల్యాణిచాళుక్య రాజప్రతినిధియైన
కాకరాజిచ్చట కట్టెనీ కోట
జయపతాకలు యెగుర కాకతీయులు మరియు
విజయనగరపు రాజులేలినారీ కోట. // ఇదెగండికోట//
ప్రౌఢరాయలు మెచ్చి తిమ్మనాయుని కీయ
నొచ్చుకొను పన్నులన్ తొలగించి ప్రజమెచ్చ
పాలించినాడతడు ప్రభువన్న యితడన
మృణ్మయంబైనట్టి యాకోట కుడ్యముల్
తొలగించి కఠినమౌ రాళ్ళతోగట్టించి
దుర్భేధ్య మీకోట యనగ నిలబెట్టె. // ఇదెగండికోట//
కాలక్రమమ్మునా రాజరికములు మారి
రామ లింగనాయుడు మరియు బంగారు
తిమ్మనయుడు రాజు లై యేలిరీకోట
ఆ వరుస క్రమమున్ చినతిమ్మనాయుడూ
యేలికై కళలను కవుల పోషించె
స్వాతంత్ర్యరాజునని ప్రకటించుకొని వెలిగె
కాలమిట్టులగడవ సచివుడౌ లింగన్న
శత్రుపక్షముజేరి అబ్డుల్ కుతుబుషా
ఆంతరంగికుడైన మీర్జుమ్లతోగలసి
రాజునకు విషమిచ్చి చంప రాజ్యమ్మును
ముస్లిములు గైకొ న్ మీర్జుమ్ల యేలికై
బెదిరించి హిందువుల పడగొట్టె గుడులను // ఇదెగండికోట//
మాధవుని గుడి మరి రఘునాధ శివ గుడులు
శిధిలమై మిగిలెనా మీర్జుమ్ల ధాటికి
ఇస్లాము ముల్లాల బోధవిని మీర్జుమ్ల
ప్రజలమేల్గోరి ఒక ధాన్య గారముగట్టె
ప్రార్థనల కనువుగా మస్జీదు గట్టించె
పడగొట్టినా గుడుల బాగుచేయగ నెంచె
కాని యప్పటి ఢిల్లి- పరిపాలకుల ముదల
లేక సాయముచేయ లేక వ్యధజెందె
బదిలియై యస్సాము గారొ కొండలయందు
ఆరోగ్యపతనమై యచ్చటనె మృతిచెందె. // ఇదెగండికోట
***
Gandikota