Monday, 8 May 2023

మేడిచెట్టు (అత్తిచెట్టు)


 

మేడిచెట్టు (అత్తిచెట్టు)



మేడిచెట్టు మర్రిచెట్టును బోలియుండు పెద్దవృక్షం. ఈచెట్టు లో మేడి, బ్రహ్మమేడి (కాకి మేడి) అని రెండురకాలున్నాయి.  బ్రహ్మమేడి పండ్లు తినరు. అత్తిపండ్లు తింటారు. మేడిపండుచూడ మేలిమైయుండును పొట్టవిచ్చిచూడ పురుగులుండుఅన్న వేమన పద్యమొకటున్నది. కనుక పురుగులు ఊదేసి తింటుంటారు. ఇప్పుడు  హైబ్రీడ్‌మేడిపండ్లు వస్తున్నాయి. వాటిలో పురుగులు వుండవు. పెద్దవిగానూ రుచిగానూ కూడా వుంటున్నాయి. ఎండిన మేడిపడ్లు కూడా తినడానికి బాగానే వుంటాయి, వీటిని మిఠాయిల్లోకూడా ఉపయోగిన్నారు. మేడిని అంజూరం, ఉదుంబర అనికూడా పిలుస్తారు.    

రాక్షసగురువైన శుక్రాచార్యులు మేడికధిపతి. మేడిచెట్టుమూలంలో దత్తాత్రేయుడు కొలువైవుంటాడు. కనుక మేడిక్రింద దీపారాధనచేసి ధ్యానంచేస్తే జ్ఞానము ప్రశాంత కలుగుతాయి. గురుబలం పెరుగుతుందని శాస్త్రం చెబుతున్నది. మేడివృక్షంచుట్టూ రోజుకు 11 చొప్పున 41 రోజులు పూజించి ప్రదక్షిణలు చేస్తే కోరికలుతీరి అదృష్టము ఆరోగ్యమూ యేకకాలంలో సిద్ధిస్తాయి. ప్రతిగురువారమూ, పున్నమిరోజుల్లోనూ మృగశిర, శ్రవణ, ఉత్తరాషాడ, జేష్ట నక్షత్రమున్నరోజులు  ప్రదక్షనలకు  అనుకూలమని పండితులు చెబుతున్నారు. ప్రదక్షణలుచేస్తున్న సమయంలో క్రిందతెలిపిన దత్తాత్రేయస్వామి శ్లోకాలను భక్తితో పఠించడం ఉత్తమోత్తమం. –

                     జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిమ్ ।

                    సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే.  

                      నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో|

                         సర్వ రోగ ప్రశమనం కురు శాంతిం ప్రయచమే||

 మేడిచెట్టు ఇంట్లో పెంచుకోవడం మంచిదే, కానీ ఇది మహావృక్షమై ఇంటిగోడలనూ, పునాదులనూ తనవేళ్ళతో పెగలించి నష్టపరచవచ్చు. అందుకే పెంచుకోవడంలేదు.

 మేడిచెట్టుకు నరసింహస్వామి వరముందని పౌరాణికులు తెలియజేస్తున్నారు. ప్రహ్లాదుని తండ్రియైన హిరణ్యకశిపుని నరసింహస్వామి తన వాడియైన గోర్లతో చీల్చిచంపాడు. అప్పుడు స్వామిచేతులకంటిన రక్తం కారణంగా విపరీతమైన జిలలు పుట్టాయి. లక్ష్మీదేవి అదిగమనించి మేడిఆకులు పండ్లరసం పట్టించి, జిలలను తగించింది. అప్పుడు మేడినిమెచ్చి నరసింహ స్వామి, మేడివృక్షమా! నీయందు నేను విరాజమానమైయుండి, నిన్ను భక్తితో పూజించినవారి విషబాధలు తొలగిస్తాను. కోరినకోరికలు నెరవేరుస్తాను. అంతేగాక నీనీడన చేసే యజ్ఞయాగాదులకు   అధికఫలం దక్కుతుందని వరమిచ్చాడు. మేడి చెట్టు సమిదలతో హోమంచేస్తే వివాహ సమస్యలు, వైవాహిక సంబం సమస్యలు ఉండవని శాస్త్రం

 చెబుతున్నది.  

 గురువారంగాని, ఆదివారంగాని మేడిచెట్టుకు నీళ్ళుపోసి, పసుపు కుంకుమలతో   పూజించి దత్తాత్రేయుని ప్రార్దించి, ఉత్తరదిక్కుకు ప్రాకిన వేరుకు పసుపుకుంకుమలు పట్టించి, నాకష్టాల నివృత్తికోసమే వేరు సేకరిస్తున్నానని చెట్టుకు విన్నవించి,  ఒక అంగుళంవేరు కత్తిరించి కళ్ళకద్దుకొని ఇంటికితెచ్చి దేవునిగూటిలోవుంచాలి. మరునాడు తిరిగీ చెట్టువద్దకువెళ్ళి పూజించి తిరిగివచ్చి, దేవునిగూటిలోనున్న మేడివేరును తాయెత్తులోవుంచి పూజచేసి మెడలో కట్టుకోవాలి. ఈతాయెత్తు మహిమాన్వితమై ధరించినవారి కష్టాలుతీరి శుభాలు సంప్రాప్తమౌతాయి.  .

 మేడిచెట్టు ఆయుర్వేదవైద్యంలోగూడా  ఉపయోగపడుతున్నది. మేడిపండ్లలో పీచుపదార్తముండి జీర్ణక్రియకు తోడ్పడుచున్నది. వీటిలో ఖనిజాలు, విటమినులు, క్యాల్సియం, ఇనుము ఉండటంవల్ల ఆరోగ్యపరిరక్షణ జరుగుచున్నది. కడుపులోమంట, ప్రేగులలోపూత అజీర్తిని నివారిస్తున్నవి. పొటాషియంకూడా ఈపండ్లలో వుండతంవల్ల గుండెకు బలం జేకూరుతున్నది. అధికబరువును తగ్గిస్తున్నది. భోజనానంతరం రెండుపండ్లు తింటే నోటిదుర్వాసన తగ్గిపోతుంది. ఎండుపండ్లు  తినడంవల్ల మలబద్ధకం తొలగిపోతుంది. బాగానిద్రపడుతుంది. అధికక్రొవ్వును తగ్గిస్తుంది. ఎలర్జి, దగ్గు, కఫం నివారణమౌతాయి. మేడిపండ్లను నీడలోఆరబెట్టి పొడిచేసి, పంచదారకలిపి సేవిస్తే రక్తహీనత, ముఖంపై మొటిమలు తొలగిపోతాయి. మేడి బెరడుకషాయంలో తేనెకలిపి రోజూ ఒక అరగ్లాసు ఉదయాన్నే త్రాగితే మధుమేహ (చెక్కెర)వ్యాధి అదుపులోనికి వస్తుంది. అరికాళ్ళమంటలు తగ్గుతాయి. తగ్గిన కంటిచూపు మెరుగౌతుంది. స్త్రీల కుసుమవ్యాధులు, గర్భస్రావాలు, నడుంనొప్పికి మంచిమందుగా పనిజేస్తుంది. హోమియోపతివైద్యంలో  Ficus  Recimosa  అన్నపేరుతో మందు దొరుకుతున్నది. ఇది స్త్రీల అనేక కుసుమవ్యాధులకు మంచిమందుగా పనిజేస్తున్నది.             

    

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...