Showing posts with label వాసవి. Show all posts
Showing posts with label వాసవి. Show all posts

Sunday, 23 August 2020

వాసవి

 వాసవి

 

          విశ్వమెల్ల శాంతిదాంతి - విస్తరిల్లగాజేసి

         వసుంధరను రక్షింపగ - వాసవాంబ కదలిరా

 

    కుసుమశ్రేష్ఠి కుసుమాంబకు - సుకుమార సుతగబుట్టి

    భాస్కరాచార్యులకడ - పరతత్త్వపు విద్యలెరిగి

    దివ్యత్వము తానుబొంది - జాతికి నవతేజ మొసగి

    మార్గదర్శివై నిలచిన - మహనీయవు నీ వమ్మా.      //విశ్వమెల్ల //

 

    దుష్టత్వము దుర్మార్గము - నెదిరింపగ నెంచి నీవు

    సత్యాగ్రహ మాయుధముగ - చేబూని నిలచినావు

    అహింసయే నా పథమని  - అగ్నిలోన గలసినావు

    అమరత్వము నొంది నీవు - ఆరాధ్యవైనావు.        //విశ్వమెల్ల //

 

    నీ విచ్చిన స్ఫుర్తితోడ - నడచి మహాత్మాగాంధీ

    తెల్లదొరల పారద్రోలి - తెచ్చినాడు స్వాతంత్ర్యం

    పొట్టిశ్రీరాములు నీ - సత్యాగ్రహ దీక్ష బూని

    ఆంధ్రరాష్ట్రమానాడే - ససువులిచ్చి దెచ్చినాడు.    //విశ్వమెల్ల //

 

    అన్నిధర్మములకన్న -  అహింసయే మిన్నయని

    సత్యాగ్రహశక్తి నెరిగి - సమ్మతితో జీవించెడి

    ఆస్తిక జనులందరిని - ఆదరింతువమ్మ నీవు

    నీపదపద్మములు గొలిచి - నీరాజనమిత్తువమ్మా.      //విశ్వమెల్ల //


                            -ooo-


        search : VASAVI


పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...