Monday, 24 August 2020

కొండమల్లి

 కొండమల్లి

 

    కొండల్లో కోనల్లో పెరిగే సిరిమల్లిని

    కొండమల్లెంటారునన్ను అహఁ అడవిమల్లెంటారు నన్ను

 

    ఆకాశమెహద్దుగా భూమే నా సొత్తుగా

    అల్లుకొనీహాయిగా విరబూసిన దీవెలతో

    సుగంధాన్ని వెదజల్లీ అడవికే అందమైతి కొండల్లో/

 

    పచ్చ పచ్చ ఆకులతో లేదీగల సొగసులతో

    చిరుగాలికి తలయూచుచు కోనలలో కొలువుదీరి

    పుప్పొడి వెదజల్లి పూలు నేలరాల్చి మురిసిపోదు   కొండల్లో/

 

    పాలనురుగు తెల్లదనపు పూలకాంతి తో మెఱసి

    చిరునవ్వులు చిందిస్తూ వనదేవత శిగనెక్కి

    ఆనందపు టంచు జేరి అలరా రే లతగుబురును  కొండల్లో/

 

    తొట్టిమట్టి పేదరికం ఖర్మ కత్తిరింపందం

    పొగలసెగల మైలబ్రతుకు మనిషి గిచ్చి చేసినట్టి

    నఖగాయపు బాధలునే నెఱుగనంటె నెఱుగనెపుడు కొండల్లో/

 

***


No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...