దర్భ
"కుశాగ్రేచ సదావిష్ణుః కుశమధ్యే శివస్మృతః
కుశాంతేచ
సదావిధిః కుశః త్రైమూర్తికోవిదుః
హిందువులకు శుభాశూభకార్యాలన్నింటీలో దర్భల ఉపయోగం తప్పనసరి. దర్భమూలంలో బ్రహ్మ, మధ్యలో శివుడు, కొసలో విష్ణువు విరాజమానమైవుంటారని శాస్త్రంచెబుతున్నది.
శ్రీరామునిస్పర్శచే దర్భలు పవిత్రతను సంతరించుకొన్నవని బుధు ఉవాచ.
యజ్ఞయాగాదుల నుండి దేవతాప్రతిష్ఠలలోను, పితరులకుపిండప్రదానాలలోనూ,
కుంభాభిషేకాది సందర్భాలలోనూ దర్భలు తప్పనిసరి. యాగశాలకలశాలకు బంగారు, వెండితీగలతోబాటు దర్భనుచేర్చిచుడతారు.
వినాయకునికి ప్రీతిపాత్రమైనదిగా భావించి గణపతిపూజలో
మిగతాపత్రితోబాటు దర్భనుచేర్చి పూజిస్తారు. కృష్ణయజుర్వేద
పరాయతంలో దర్భపవిత్రత గొప్పగాచెప్పబడింది. వైదికకార్యాలలో "పవిత్ర" అన్నపేరుతో కుడి ఉంగరపువ్రేలికి దర్భను
ఉంగరంగంగాచుట్టి ధరించి కార్యక్రం నెరవేరుస్తారు. ఉంగరంవ్రేలిగుండ
కఫనాడి వెళుతుంది. ఆవ్రేలికి దర్భ ఉంగరం ధరించడంద్వారా
కఫంనివారించబడి కంఠంశుభ్రపడి వేదమంత్రాలు స్వచ్ఛంగా పలుకగలుగుతారు. అందుకే వేదాభ్యాసంచేసే విద్యార్థులు దర్భ ఉంగరం తప్పక ధరిస్తారు. ప్రేతకార్యనిర్వహనలో ఒకదర్భను ఉంగరంగాచేసుకుంటారు. వివిధశుభకార్యాలలో
రెండు, పితృకార్యాలలో మూడు, దేవకార్యాలలో
నాలుగుదర్భలు ఉంగరంగా చుట్టుకుంటారు. అందువల్ల
అపవిత్రవస్తువులను తాకినా, చెడువార్తలువిన్నావచ్చే దోషం దర్భదారణతో
నివారణమౌతుంది, అంతేగాక వారి ప్రాణశక్తి హెచ్చింపబడుతుంది.
దర్భలుకోసేటప్పుడు మంత్రపూర్వకంగా కోసుకరావడం మంచిది. ఆమంత్రం యిది
“విరించినా
సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ
నుద సర్వాణి పాపాని
దర్భ స్వస్తికరో భవ”
దర్భలు ఆదివారం కోసితెస్తే ఒకవారంవరకు
పనికివస్తాయి. అమావాస్యదినం
తెచ్చుకుంటే ఒకమాసం, పున్నమినాడు తెస్తే ఒకపక్షం
పనికివస్తాయి. అదే శ్రావణమాసంలో తెచ్చుకుంటే సంవత్సరమంతా వాడుకొనవచ్చును.
భాధ్రపదమాసంలోతెచ్చుకుంటే ఒకపక్షంలోనే వాడుకోవాలి. శ్రాద్ధకర్మలకోసం తెచ్చిన దర్భలుమాత్రం యేరోజుకారోజే ఉపయోగించాల్సి
ఉంటుంది.
దర్భలతోఅల్లిన చాపను దర్భాసనం అంటారు. ఈఆసనంపై కూర్చొని ధ్యానంచేయడంద్వారా ధ్యానంవల్లపొందిన శక్తి భూమిగ్రహించకుండా ఆపుతుంది. మంత్రపూరితజలప్రభావం తగ్గిపోకుండా ఉండటానికి ఆజలంలో దర్భవేసి ఉంచుతారు. పూజాసమయంలో సహోదరులూ, భార్యాపిల్లలతో అనుసంధింపజేయడానికి దర్భలను అందరికి తాకిస్తారు. హోమంచేసేసమయంలో నాలుగువైపులా దర్భలులుంచితే దుష్టశక్తులను పారద్రోలి యజ్ఞం నిరాటంకంగా జరిగేట్లు చేస్తాయి. బుధులు అష్టార్ఘ్యాలు చెప్పారు. వాటిలో దర్భకూడా ఉన్నది. అవి పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, పుష్పములు, దర్భలు. 12 రకాల గడ్డిమొక్కలను దర్భలుగా పరిగణిస్తారు. అవి కుశలు, కాశములు(రెల్లు), దూర్వ(గరిక), వీహ్రీ(ఎఱ్ఱబుడమగడ్డి), యవలు, ఉసీరములు(వట్టివేరు), విశ్వామిత్రములు, బల్బజములు(మొలవగడ్డి), గోదుమగడ్డి, కుందరముగడ్డి, ముంజగడ్డి, పుండరీకములు. ముఖ్యముగా దర్భజాతులను అపకర్మలందు, కుశజాతులను పుణ్యకార్యములందు, బర్హిస్సుజాతులను యజ్ఞయాగాదిశ్రౌతక్రతువులందును, రెల్లుజాతులను గృహనిర్మాణకార్యములందును వాడుట మంచిది. దర్భలను విశ్వామిత్రసృష్టిగా కొందరుభావిస్తారు. పితృకార్యములకు దర్భలను సమూలంగా గ్రహించడం అవసరం. దర్భకొసలు పదునుగావుంటాయి. ఇటువంటి దర్భలు దేవతలఆవాహనుకు ఉపయోగిస్తారు.
No comments:
Post a Comment